Andhrapradesh, మే 2 -- ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. మే 10వ తేదీ తర్వాత రిజల్ట్స్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఫలితాలతో పాటే ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ఇవాళ(మే 2) అందుబాటులోకి రానుంది. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెెళ్లి కీని పొందవచ్...