Amravati, జూలై 17 -- ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఒకటో ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు జూలై 19 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. నిర్ణయించిన ఫీజు కూడా చెల్లించాలి. https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.

జూలై 18వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 18 నుంచి 20వ తేదీ ...