భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ)-2025 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ పాలిసెట్-2025 పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్సైట్ polycetap.nic.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, పరీక్ష సమయాలు, పరీక్షకు హాజరయ్యే సమయంలో అభ్యర్థి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలను హాల్ టికెట్ లో పొందుపరుస్తారు.

హాల్ టికెట్ పై అభ్యర్థులు వివరాలను సరిచూసుకోండి. హాల్ టికెట్ పై ఏవైనా తప్పులుంటే వెంటనే పరీక్ష నిర్వహణ అధికారిని సంప్రదించాలి. అభ్యర్థులు హాల్ టికెట్ లో ఇచ్చిన సూచనలను పాటించాలి. పరీక్ష రోజు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

ఏపీ పాలిసెట్-2025 ఏ...