భారతదేశం, మే 14 -- ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

"ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వం కలలుగన్నట్లుగా, సమీప భవిష్యత్తులో ఏపీ నుండి మరిన్ని మహిళా వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులను చూడాలనే ఆశను రేకెత్తిస్తూ, బాలికలు 96.9% మందితో మెరుగ్గా రాణించడం చూసి సంతోషంగా ఉంది. విజయవంతమైన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు"- మంత్రి లోకేశ్

పాలిసెట్ ఫలితాల్లో అల్లూరి జిల్లా 98.66% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసి...