Andhrapradesh,kurnool, సెప్టెంబర్ 28 -- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటంతో పాటు. కర్నూల్ సిటీలో తలపెట్టిన రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం.

ప్రాథమిక వివరాల ప్రకారం.. అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి మోదీ ఏపీలో పర్యటిస్తారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్నూలు నగరంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి పాల్గొంటారని తెలిసింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కూటమి నేతలు ఇందులో పాల్గొననున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తా...