భారతదేశం, జనవరి 16 -- సంక్రాంతి పండగ పూర్తి కావొస్తొంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్ వైపునకు భారీగా వాహనాలు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారణపై నల్గొండ జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ముందస్తు రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చని సూచించారు.

విజయవాడ - హైదరాబాద్ (నేషనల్ హైవే- 65) మార్గ మధ్యంలోని చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నట్లు నల్గొండ జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు...