Andhrapradesh,telangana, జూలై 20 -- తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. గత కొన్నిరోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఈనెల 24వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది.

ఇవాళ(జూలై 20)అల్లూరి సీతారామరాజు,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి,కడప,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వ...