Andhrapradesh, మే 17 -- ఏపీలోని నిరుద్యోగులకు మరో అలర్ట్ వచ్చేసింది. డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. హెడ్ ఆఫీస్ మంగళగిరిలో 2 ఖాళీలు ఉండగా.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ -పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లాలో ఒక్కో ఖాళీ ఉంది.

ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ప...