భారతదేశం, మే 22 -- మెగా డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారన్న డేటా అధికారుల వద్ద ఉంది. దీంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు.

అధికారిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్‌ అయాన్‌ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6 తేదీ నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు ఈ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతోపాటు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్...