Andhrapradesh, అక్టోబర్ 3 -- మెగా డీఎస్సీలో ఎంపికయిన ఉపాధ్యాయులకు ఇవాళ్టి నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. వారం రోజులపాటు కొత్త టీచర్ల శిక్షణ తీసుకుంటారు. అక్టోబర్ 10వ తేదీతో ఈ ట్రైనింగ్ ముగుస్తుంది.

ఇక శిక్షణ తీసుకునే టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఈనెల 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా. పని చేయాల్సిన పాఠశాలను కేటాయిస్తారు. ఇక అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్ అందిస్తారు. మరో విడతగా ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి.

అక్టోబర్ 13వ తేదీ నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరు అవుతారు. ఇంకోవైపు మెగా డీఎస్సీ తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అక్టోబర్ 25 వరకు తెలపవచ్చు. దీనికోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ, ఇద్దరు డీఈవోలతో జోనల్ కమిటీ, రాష్ట్రస్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్రస్థాయి అధికార...