Andhrapradesh, జూన్ 17 -- ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగిశాయి. జూన్ 30వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది.

నేటి నుంచి (జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీ విడుదల కానుంది. వీటికపై జూన్ 23వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ ప్రాథమిక కీలను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. అభ్యంతరాలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పంపవచ్చు. త్వరలోనే మిగతా పేపర్ల ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్...