Andhrapradesh, ఏప్రిల్ 25 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 15వ తేదీతో పూర్తవుతుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియలో పలు ఇబ్బందులు ఉంటున్నాయని చెబుతున్నారు.

ముఖ్యంగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయని అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఈసారి కొన్ని మార్పులు తీసుకురావటంతో.. ఈ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అర్హతల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొన్నిసార్లు సెలెక్ట్ ఆప్షన్లు కూడా సరిగా తీసుకోవటం లేదని అంటున్నారు.

వెబ్ సైట్ లో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిపా...