భారతదేశం, మే 10 -- డీఎస్సీ దరఖాస్తుల్లో టెట్ మార్కులు, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థులు చాలా ఏళ్లుగా డీఎస్సీ కోసం వేచిచూడడం, ప్రిపరేషన్ లో ఉండడంతో టెట్ మార్కులు మర్చిపోతున్నారు. దీంతో దరఖాస్తు సమయంలో వారికి ఇబ్బంది మారుతోంది. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం టెట్ ఐడీ, మార్కులను ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15తో దరఖాస్తులు ముగుస్తాయి. డీఎస్సీ దరఖాస్తుల్లో ముందు నుంచీ సమస్యలు తలెత్తున్నాయి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముందు స్టడీ, ఒరిజనల్ సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌ చేయాలని కోరడంతో ఇబ...