Andhrapradesh, మే 21 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. మరోవైపు అభ్యర్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రిపేర్ అవతున్న అభ్యర్థుల కోసం వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

డీఎస్సీ పరీక్షలో మంచి స్కోర్ సాధించటం కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా. అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటు...