Andhrapradesh, జూన్ 15 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులను చేసింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లను https://apdsc.apcfss.in వెబ్ సైట్ లో అం...