Andhrapradesh, జూలై 4 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సబ్జెక్టుల ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా. తాజాగా విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. మెగా డీఎస్సీలో భాగంగా జూన్ 6 నుంచి జూన్ 28 వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గురువారం విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలను మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

తాజాగా విడుదలైన ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని సంబంధిత ఆధారాలతో జూలై 11 లోపు https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 29 నుండి జూలై 2 వరకు జరిగే పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు కూడా త్వరలో విడుదల చేస్తామమని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణార...