భారతదేశం, మే 18 -- టీచర్ జాబ్ సాధించేందుకు.. ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3.35 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 7 వేల 159 మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ అభ్యర్థులే దాదాపు 7 వేల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ మెగా డీఎస్సీకి సంబంధించి నాన్ లోకల్ కోటా కింద 20 శాతం పోస్టులను కేటాయించారు. వాటికి ఏపీతోపాటు.. ఏ రాష్ట్రం వారైనా పోటీపడవచ్చు. అయితే.. టెన్త్‌లో సెకెండ్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా ఉండాలి. నాన్ లోకల్ కోటా పోస్టుల కోసం.. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట నుంచి ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు.

సరిహద్దు జిల్లాలే కాకుండా.. రంగారెడ్డి, వ...