భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కౌన్సిలింగ్‌ గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి అయింది. విద్యార్థులంతా కూడా సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. మొదటగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఈనెల 10వ తేదీనే సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. కానీ ఈ తేదీని 11వ తేదీ వరకు పొడిగించారు. అయితే మళ్లీ ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థుల నుంచి పలు విజ్ఞుప్తులు రాగా. అధికారులు ఈ గడువును ఈనెల 13వ తేదీకి పొడిగించారు. దీంతో రేపు విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు.

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మొత్తం 1,67,161 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,54,022 మంది దరఖాస్తులు సమర్...