Andhrapradesh, సెప్టెంబర్ 26 -- నేటి నుంచి ఏపీలో డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈగడువు సెప్టెంబర్ 29వ తేదీతో పూర్తవుతుంది. https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

అర్హులైన విద్యార్థులు ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ గడువు ఈనెల 29వ తేదీతో పూర్తవుతుంది. ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు ఉంటుంది. ఇక వెబ్ ఆప్షన్లు ఈనెల 29వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ గడువు అక్టోబర్ 1వ తేదీతో పూర్తవుతుంది.

అక్టోబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 6వ తేదీన రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 7 నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ...