భారతదేశం, నవంబర్ 1 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నవంబర్ 2వ తేదీ వరకు సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం.... నవంబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఇక నవంబర్ 4వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఈ థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబరు 7లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు...