Andhrapradesh, ఆగస్టు 31 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ గడువు రేపటితో (సెప్టెంబర్ 1) పూర్తి కానుంది. కాబట్టి ఈలోపు అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గడువు పొడిగించిన నేపథ్యంలో. మరోసారి పొడిగించే అవకాశం లేదు.

ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఈ గడువు సెప్టెంబర్ 2వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే. సెప్టెంబర్ 3వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చు. వీరికి సెప్టెంబర్ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయి.

డిగ్రీ కోర్సుల్లో చేరుందుకు ఆసక్తి గల విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట...