Andhrapradesh, జూలై 14 -- రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి జూలై 17వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

కౌన్సెలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను వెబ్ సైట్ https://www.rgukt.in/ లో పొందుపరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా సమాచారం పంపించారు. ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్ కేంద్రాల్లో నిర్వహించే కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటించాల్సి ఉంది.

రాష్ట్రంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉ...