భారతదేశం, డిసెంబర్ 10 -- ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలను వచ్చే ఏడాదిలో నిర్వహిస్తారు. ఇందుకోసం ఎగ్జామ్ ఫీజులను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన అధికారులు. తాజాగా మరోసారి ప్రకటన చేశారు.

రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 12 వరకు పదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చు. ఇక రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 18వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే...