భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అలాగే పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న పావని చంద్రిక 598 మార్కులు సాధించింది. బాలికను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి.

పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్...