భారతదేశం, డిసెంబర్ 20 -- ఏపీ టెట్ - 2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 21వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతున్నాయి. ఓవైపు ఎగ్జామ్స్ జరుగుతుండగా. మరోవైపు పూర్తి అయిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరికొన్ని పేపర్ల ప్రాథమిక కీలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

ఈనెల 12, 13, 14, 15వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఇందులో ఎక్కువగా ఉదయం సెషన్ జరిగిన పరీక్షలవే ఉండగా.మరికొన్ని మధ్యాహ్నం సెషన్ పరీక్షల ప్రాథమిక కీలున్నాయి. ఆయా సెషన్లలో జరిగిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈనెల 10వ తేదీన ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2ఎ తెలుగు భాష పరీక్ష, 11వ తేదీన ఉదయం నిర్వహించిన పేపర్‌-2 మైనర్‌ లాంగ్వేజ్‌ పరీక్షల ప్రాథమ...