భారతదేశం, అక్టోబర్ 26 -- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 23, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇదే తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు.

విద్యాశాఖ తెలిపిన షెడ్యూల్ వివరాల ప్రకారం.. మాక్ టెస్ట్ ఆప్షన్ నవంబర్ 25, 2025న అందుబాటులోకి వస్తుంది. హాల్ టిక్కెట్లు డిసెంబర్ 3, 2025 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

ఏపీ టెట్ పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయ...