భారతదేశం, డిసెంబర్ 3 -- ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా. రేపోమాపో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి.

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ వివరాల ప్రకారం.. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు ఒక సెషన్ ఉండగా.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. .మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ఈసారి జరిగే టెట్ పరీక్ష కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీన ప్రాథమిక కీలు విడుదలవుతాయి.జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జ...