Andhrapradesh, ఆగస్టు 3 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో కలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ముందుగా ప్రకటించిన రాత పరీక్షల తేదీలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. పలు ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు వివరించారు.

మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేస్తుండగా.... వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినెట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ తేదీలు పాతవే ఉండనున్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III/ జూనియర్ అసిస్టెంట్, టైపి...