Andhrapradesh, మే 31 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. ఈ సమయం దగ్గరపడింది. జూన్ 2వ తేదీతో ఈ గడువు ముగియనుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు. వారి విద్యా అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లోకలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్నింటిని డిగ్రీ, మరికొన్నింటికి ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతలు ఉన్నాయి. డ్రైవర్ అభ్యర్థ...