Andhrapradesh, జూలై 11 -- ఏపీ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తుది రాత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా... 33,921 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

మరోవైపు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 11 నుంచి 17 వరకు తెలపవచ్చని అధికారులు ప్రకటించారు.

ఏపీలో కానిస్టేబుళ్ల నియామకాల కోసం 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు.

ఏపీలో కానిస్టేబుల్ ర...