భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు. కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుంది.

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై 28న పూర్తయింది. ప్రస్తుతం తుది విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా 15వేలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 33 వేల సీట్లు మిగిలి ఉండగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ విడత కూడా పూర్తి అయితే. స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. దీనిపై...