భారతదేశం, నవంబర్ 19 -- రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 7 గంటలకు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.

మంగళవారం ఎన్ కౌంటర్ జరగగా ఆరుగురు మృతి చెందగా వీరిలో టాప్ లీడర్ హిడ్మా కూడా ఉన్నాడు. అయితే ఇవాళ కూడా కూంబింగ్ కొనసాగుతుడంగా. ఉదయం కాల్పులు జరిగాయని ఏపీ పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా. కీలక నేతగా పేరొందిన మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నాడు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పేరొందాడు. శ్రీకాకుళానికి చెందిన శంకర్.. ...