భారతదేశం, నవంబర్ 19 -- ఇవాళ మరోసారి ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు.

ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా మాట్లాడారు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం ఉందని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

నవంబరు 17వ తేదీన ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశామని. నవంబర్ 18వ తేదీన ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావటానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన...