భారతదేశం, నవంబర్ 1 -- లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెల 23తో గడువు ముగియగా.. ఇప్పుడు 2026 జనవరి 23 వరకు పొడిగించారు.

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ ఏడాది జులై నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు. గడిచిన ఈ 3 నెలల కాలంలో.... 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు గడువు పొడిగించడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

ప్లాట్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ ఛార్జీలు ఉంటాయి. 10 శాతం ఓపెన్ స్పేస్ లేకపోతే 14 శాతం అదనపు ఛార్జీలు విధిస్తారు. పాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు కూడ...