భారతదేశం, అక్టోబర్ 2 -- బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల జరుగుతుండగా... ఈ గడువు అక్టోబర్ 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.

అక్టోబరు 5 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గడువు అక్టోబర్ 7వ తేదీతో పూర్తవుతుంది. 8వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలో లోపు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.

ఈసారి...