భారతదేశం, మే 20 -- ఏపీలో పాఠశాలల వర్గీకరణపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు అభయంతరం వ్యక్తం్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 9 క్యాటగిరీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

పాఠశాలల హేతుబద్దీకరణ, ఉపాధ్యాయుల క్రమబద్దీకరణపై ప్రభుత్వ ప్రతిపాదనల్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ బలహీనం అవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన తొమ్మిది ఉపా ధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోద యోగ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది.

సోమవారం ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు ఫలించక పోవడంత...