Andhrapradesh, జూలై 31 -- ఏపీలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి పేరు ఖరారైంది. ఈ పథకానికి ' స్త్రీ శక్తి ' అని పేరు పెట్టారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రణ కూడా ఉండనుంది. ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రానుంది.

మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ల జారపై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్రమంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.

అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్...