భారతదేశం, ఏప్రిల్ 29 -- ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ 2025 జరగనుంది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మే 6న రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణకు జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది.

జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడుతూ...ఏపీ ఈసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ ఈసెట్ మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వీసీ సుదర్శనరావు తెలిపారు.

ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్...