Andhrapradesh, జూలై 18 -- బీటెక్‌ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. https://ecet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫీజు చెల్లించటంతో పాటు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

ఏపీ ఈసెట్ - 2025 ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు... ఇవాళ్టి(జూలై 18) నుంచి ఫీజు చెల్లించుకోవచ్చు. జూలై 19తో ఈ గడువు పూర్తవుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఇవాళ్టి నుంచే వెబ్ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. ఈ గడువు జూలై 20వ తేదీతో పూర్తవుతుంది. జూలై 21వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 22వ తేదీన తుది విడత సీట్లను కేటాయిస్తారు.

ఈ ఫైనల్ ఫేజ్ లో సీ...