Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలనే ఈఏపీసెట్ మూడో విడత(చివరి) కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఏపీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ఈనెల 11వ తేదీన పూర్తి కావాలి. అయితే ఈ తేదీని ఈనెల 14వ తేదీ వరకు పొడిగించారు. దీంతో అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇక ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఈనెల 15 వరకు కొనసాగనుంది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈనెల 16వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవాలి. ఈనెల 18వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ ఈఏపీసెట్ ...