Andhrapradesh, జూలై 13 -- ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగా. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ జూలై 16వ తేదీతో ముగియనుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు. నేటి (జూలై 13) నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

కాలేజీల్లో సీట్లు పొందేందుకు వెబ్ ఆప్షన్లను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు. జూలై 18వ తేదీలోపు https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక జూలై 19వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంట...