భారతదేశం, ఆగస్టు 3 -- ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫైనల్ ఫేజ్ సీట్లను సోమవారం(ఆగస్ట్ 4) కేటాయించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా. ఫైనల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ కూడా చివరి దశకు చేరింది.

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆగస్టు 4వ తేదీన ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 4 నుంచి సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి. 8వ తేదీ వరకు ఈ ఛాన్స్ ఉంటుంది. నిర్ణయించిన సమయంలో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఆగస్టు 4 నుంచి బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఆలోపే విద్యార్థులు సెల్ప్ రిపోర్టింగ్ తో పాటు ఇతర ప్రక్రియలను ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఏపీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వివ...