Andhrapradesh, జూలై 23 -- ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇవాళ కేటాయించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కూడా పూర్తయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.జూలై 22వ తేదీన ఖరారు చేయాల్సి ఉంది. కానీ సీట్ల కేటాయింపు ప్రోగ్రామ్‌ రన్నింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవటంతో ఇవాళ (జూలై 23) విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఏపీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో దాదాపు 1.20 లక్షల మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరంతా కూడా సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. సీట్ల కేటాయింపు పూర్తి కాగానే. విద్యార్థులు https://eapcet-sche.aptonline.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సీట్లు పొందే అభ్యర్థులు. జూలై 24 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు జ...