Andhrapradesh, ఆగస్టు 15 -- స్థానికత అంశంపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్ ఫేజ్ పై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌లో మొత్తం 77.72 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

ఏపీఈఏపీసెట్ పైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కోర్సులు, కాలేజీలను మార్చుకునేందుకు 28,735 మంది విద్యార్థులు స్లైడింగ్‌ తీసుకున్నారు. ఈ విడతలో 14,409 మందికి సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి 1,53,964 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 1,19,666 సీట్లు భర్తీ అయ్యాయి. అన్నింటిలో కలిపి 34,298 సీట్లు మిగిలాయి. క్రీడా కోటాకు సంబంధించి సీట్లను కేటాయించాల్సి ఉంది.

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ సీట్లను ఆగస్టు 14వ తేదీన కేటాయించారు. సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 20వ తేదీలోపు రిపోర్ట...