Andhrapradesh, ఏప్రిల్ 26 -- ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మా అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 24వ తేదీతో సాధారణ గడువు ముగియగా. ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఇందుకు మే 16వ తేదీ వరకు అవకాశం ఉంది. తక్కువ ఫైన్ తో మాత్రం. మే 1 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు ఏర్పాటు చేయగా. హైదరాబాద్‌లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. మే 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని వెబ్ సైట్ లేదా వాట్సాప్(మన మిత్ర) ద్వారా పొందవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుతుంది. ప్రాథమిక క...