Andhrapradesh, మే 30 -- ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను నిర్వహించారు. ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కీపై అభ్యంతరాల గడువు ముగిసింది. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించి మే 30వ తేదీతో అభ్యంతరాల గడువు పూర్తవుతుంది.

ప్రాథమిక కీలపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సాంకేతికపరమైన అంశాలను తనిఖీ చేస్తారు. అన్ని దశల్లో ప్రక్రియ పూర్తి కాగానే ఫలితాల తేదీని ప్రకటిస్తారు. అయితే జూన్ 14వ తేదీన ఫలితాలను వెల్లడించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇలా కుదరకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటుగా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై ఉన్నత విద్యా మండలి అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.

ఏ...