భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ముంబైకు చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో పిఎస్సార్‌ ఆంజనేయులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పిఎస్సార్ ఏ2గా ఉన్నారు.

ముంబై నటి కాదంబరి జెత్వాని ఆరోపణలపై పిఎస్సార్‌ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పిఎస్సార్ మినహా మిగిలిన పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులో తన ప్రమేయం లేదన్న పిఎస్సార్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

ముంబై నటి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్‌ డీజీని మంగళవారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైకు చెందిన పార...