భారతదేశం, అక్టోబర్ 29 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫీజులను కూడా స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా ప్రకటన మేరకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఇక రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్‌ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక ఇంటర్ పరీక్షల ఫీజుల వివరాలు చూస్తే. జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పరీక్షలకు రూ.600గా ఉంది. ప్రాక్టికల్స్‌కు జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) విద్యార్థులకు రూ.275గా నిర్ణయించారు. జనరల్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులకు రూ.165 కాగా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకండ్ ఇయర్) రూ.275గా ఉంది.

ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండూ క...