భారతదేశం, నవంబర్ 6 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 31వ తేదీతో గడువు ముగిసింది. ప్రస్తుతం రూ. 1000 ఫైన్ తో ఫీజులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ సమయం కూడా దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు ఇవాళ(నవంబర్ 6) ఫీజు చెల్లించుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడించే అవకాశం లేదు.

ఏపీ ఇంటర్ పరీక్షల ఫీజుల వివరాలు చూస్తే. జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పరీక్షలకు రూ.600గా ఉంది. ప్రాక్టికల్స్‌కు జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) విద్యార్థులకు రూ.275గా నిర్ణయించారు. జనరల్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులకు రూ.165 కాగా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకండ్ ఇయర్) రూ.275గా ఉంది.

ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండూ కలిపి థియరీ పర...