భారతదేశం, మే 3 -- ఏపీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. నేటితో ఫీజు చెల్లింపు గడువు ముగియగా... ఈ నెల 5వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. మే 5తో గడువు ముగుస్తుందని, మరోసారి ఫీజు గడువు పొడిగింపు ఉండబోదని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు.

జనరల్, ఒకేషనల్ విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మే 5వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చు. మే 12 నుంచి 20 వరకు రెండు షిఫ్టుల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 2...